మన రైళ్లలో ఇలాంటి సీన్ ఎవరూ ఎప్పుడూ చూసుండరు.. వీడియో ఇదిగో!
- ప్రయాణికులతో పూర్తిగా కిక్కిరిసిపోయిన రైలు జనరల్ బోగీ
- అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా లేని చోటు
- రైలు బెర్త్‌లకు ఉయ్యాలలా కట్టి నిద్రపోయిన యువకుడు
- ఇండియాలో టాలెంట్‌కు కొదవలేదంటున్న యూజర్లు
అడుగుతీసి అడుగు వెయ్యడానికి కూడా ఖాళీలేని ఓ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పైన ఉండే బెర్త్‌లు రెండింటికీ ఓ దుప్పటిని ఉయ్యాల్లా కట్టి అందులో ఎంచక్కా నిద్రపోయాడు. రైలులో ఆ సమయంలో అందరూ నిద్రలో జోగుతున్నారు. దీనిని బట్టి అది రాత్రివేళ అని అర్థమవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 15 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇండియాలో టాలెంట్ లేదని ఎవరు చెప్పారు? అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. దేశంలో ఎంతోమంది తమ నైపుణ్యంతో ఇలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారని మరో అంటే.. ఇలాంటి ఐడియాల్లో ఇండియన్స్ ఫేమస్ అని మరొకరు రాసుకొచ్చారు. మన ఇండియాలో కావాల్సినంత టాలెంట్ ఉంది.. అది ప్రదర్శించుకునే అవకాశమే లేదు అని మరో యూజర్ పేర్కొన్నాడు. కాగా, ఈ రైలు పేరు, అది ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తోందన్న వివరాలు తెలియరాలేదు.