Khushbu: నేను హిందూ మతంలో పుట్టకపోయినా... అన్ని మతాలూ నాకు సమానమే... తిరుమల లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ

Actress Khushbu Responds Over Tirumala Laddu
  • లడ్డూలు కల్తీ చేసి కోట్లాదిమంది మనోభావాలను దెబ్బతీశారన్న ఖుష్బూ
  • తాను హిందువునే పెళ్లి చేసుకున్నానని వెల్లడి
  • హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సైలెంట్‌గా ఉండమంటే కుదరదన్న బీజేపీ నాయకురాలు
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వివాదంపై తమిళ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీ బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడమంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను హిందూ మతంలో పుట్టకపోయినప్పటికీ ఆ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. తనకు అన్ని మతాలు సమానమేనని, హిందూ మతాన్ని అవమానించవద్దని హితవు పలికారు. హిందూ మతాన్ని చులకనగా మాట్లాడొద్దని, దానిని అగౌరవపరిస్తే సహించకూడదన్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్‌గా ఉండమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర మతాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా? అని ఖుష్బూ సోషల్ మీడియా పోస్టులో నిలదీశారు.
Khushbu
Tirumala Laddu
BJP

More Telugu News