YSRCP: తిరుప‌తిలో జ‌గ‌న్‌పై దాడికి కుట్ర‌... వైసీపీ సంచ‌ల‌న‌ ట్వీట్‌

 YSRCP Sensational Tweet about Attack on YS Jagan in Tirupati
  • శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్ల‌నున్న‌ జగన్
  • భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి కుట్ర అంటూ వైసీపీ ట్వీట్‌
  • భానుప్రకాశ్, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు వెల్ల‌డి
తిరుపతిలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమలకి జగన్ వెళ్ల‌నున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జ‌నసేన‌), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు వైసీపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. 

జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. తిరుమలలో జ‌గ‌న్‌ పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్ర‌బాబు? అంటూ వైసీపీ ప్ర‌శ్నించింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.
YSRCP
YS Jagan
Tirupati

More Telugu News