డిక్లరేషన్ పై ఇంతవరకు మాట్లాడని జగన్.. సర్వత్ర ఉత్కంఠ
- ఈ సాయంత్రం తిరుమలకు వెళుతున్న జగన్
- జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటున్న హిందూ సంఘాలు, స్వామీజీలు
- డిక్లరేషన్ ఫామ్ ను టీటీడీ రెడీ చేసినట్టు సమాచారం
టీటీడీ కూడా జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ముందే... ఆయన బస చేసిన అతిథిగృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫామ్ పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్టు చెపుతున్నారు.
ఓవైపు ఇంత జరుగుతున్నా... డిక్లరేషన్ పై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో, జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.