దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట

Fight between brs and congress in Dubbak
  • దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం
  • హాజరైన మంత్రి సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
  • వేదిక మీదకు కాంగ్రెస్ ఇంఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి రావడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఈరోజు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడాన్ని బీఆర్ఎస్ వర్గాలు తప్పుబట్టాయి. వేదికపై శ్రీనివాస్ రెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. 

ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు అధికారిక కార్యక్రమం కావడంతో వేదిక మీది నుంచి శ్రీనివాస్ రెడ్డి దిగిపోయారు. రసాభాస మధ్య మంత్రి సురేఖ చెక్కులను పంపిణీ చేశారు.
Advertisement
Dubbaka
Congress
BRS
BJP

More Telugu News