హైదరాబాదులో నకిలీ మహిళా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు... ప్రముఖ హోటళ్లకు టోకరా
- జీహెచ్ఎంసీ పరిధిలో నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు
- ప్రముఖ హోటళ్లలో తనిఖీలు
- హోటల్ సీజ్ చేస్తామంటూ యజమానులకు బెదిరింపులు
- పట్టుకున్న జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు
- పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్లపై కేసు నమోదు
తాము తనిఖీలు నిర్వహించలేదని చెప్పడంతో హోటళ్ల యజమానులు బిత్తరపోయారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌ల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు నకిలీలు అని తెలిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు అయింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు హోటల్స్ వద్ద మాటు వేసి ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను పట్టుకున్నారు. అనంతరం వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ బాధిత హోటళ్లలో సికింద్రాబాద్ అల్ఫా, స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.