తమిళనాడులో ఘోరం.. నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
––
బాధితురాలి పరిస్థితి చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు దిండిగల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ దారుణానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.