Bhumana Karunakar Reddy: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమల ఆలయం ముందు ప్రమాణం చేయనున్న భూమన

Bhumana Karunakar Reddy will take swear in Tirumala
  • కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం
  • తన హయాంలో తప్పిదాలు జరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమైన భూమన
  • పుష్కరిణిలో స్నానం చేసి, ఆలయం ముందు ప్రమాణం చేయనున్న భూమన
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంతో తిరుమలను నాశనం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. కాసేపట్లో ఆయన ప్రమాణం చేయబోతున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. 

కాసేపట్లో ఆయన తొలుత తిరుమల పుష్కరిణిలో స్నానం చేస్తారు. అనంతర అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేయనున్నారు.
Bhumana Karunakar Reddy
YSRCP
Tirumala

More Telugu News