కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. భారీగా పోలీసుల మోహరింపు
- మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు
- ఈసారి కూకట్‌పల్లి నల్లచెరువుకు తరలిన హైడ్రా బుల్డోజర్లు
- 27 ఎకరాల చెరువులో ఏడెకరాల ఆక్రమణ
- నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు
చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఏడెకరాలు ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌జోన్‌లలోని నాలుగెకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. అలాగే, ఎఫ్‌టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టు నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు.