Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి!: అతిశీ

Choose Kejriwal to prevent power tariff hikes in Delhi
  • నాలుగు నెలల పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చూసుకుంటానన్న అతిశీ
  • యూపీలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారని వెల్లడి
  • యూపీలో 8 గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారన్న అతిశీ
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే అరవింద్ కేజ్రీవాల్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కాబోయే ముఖ్యమంత్రి అతిశీ అన్నారు. రానున్న నాలుగు నెలల పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా తాను చూసుకుంటానన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా విద్యుత్ ఛార్జీలు ఉన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకోవడం ద్వారా ఢిల్లీలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలను నివారించవచ్చన్నారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకోకుంటే యూపీలో చోటు చేసుకున్న పరిస్థితులే ఇక్కడా సంభవిస్తాయన్నారు.

కేజ్రీవాల్ గెలవకుంటే ఢిల్లీలో నిరంతరాయంగా విద్యుత్ కోతలు విధిస్తారన్నారు. బీజేపీ పాలనలోని యూపీలో రోజుకు 8 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. ఈ విద్యుత్ కోతలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కాదని, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో విధిస్తున్నారని మండిపడ్డారు.
Arvind Kejriwal
AAP
Atishi
BJP

More Telugu News