India vs Bangladesh: బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ దెబ్బకు భారత్ బ్యాటింగ్ కకావికలం

India vs Bangladesh Hasan Mahmud Sharp Balls Taking Indian Wickets
  • చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మొదలైన తొలి టెస్టు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • భారత స్టార్లను బెంబేలెత్తించిన హసన్ మహమూద్
  • జట్టు కోల్పోయిన నాలుగు వికెట్లు అతడి ఖాతాలోకే
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన రోహిత్ సేనను బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమూద్ కకావికలం చేశాడు. అతడి పదునైన బంతులను ఎదురొడ్డలేని భారత స్టార్లు క్రీజులోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లారు. ఫలితంగా 96 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 

కెప్టెన్ రోహిత్‌శర్మ (6), శుభమన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) ఇలా వచ్చిఅలా వెళ్లిపోయారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. మహమూద్ బంతులను ఎదురొడ్డినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లు హసన్ మహమూద్ ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతం ఓపెనర్ యశస్వి జైస్వాల్ (43), కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. భారత జట్టు ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.
India vs Bangladesh
Chennai Test
Team India
Bangladesh
Hasan Mahmud

More Telugu News