సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి
- వరద బాధితులకు ఇటీవల రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన మెగాస్టార్
- రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షల విరాళం
- తాజాగా తెలంగాణ సీఎంతో భేటీ.. శాలువా కప్పి సన్మానించిన సీఎం
ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి... శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు, సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చేస్తూ వారిని ఆదుకుంటున్నారు.
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అమర్ రాజా గ్రూప్ తరఫున రూ.కోటి, నటులు విష్వక్సేన్ రూ.10 లక్షలు, సాయి దుర్గ తేజ్ రూ.10 లక్షలు, అలీ రూ. 3 లక్షలు అందజేశారు. రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించి, ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎంలకు అందజేశారు.