KTR: మోదీ గారూ, మీరు 'ఆర్ఆర్' గురించి మాట్లాడి నాలుగు నెలలు అవుతోంది: కేటీఆర్

It is been more than 4 months since you talked about RR Tax ktr to Modi
  • ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్న కేటీఆర్
  • లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన వైనం 
  • మీ కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడటం లేదన్న కేటీఆర్
ప్రధాని మోదీజీ, మీరు తెలంగాణలోని ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడి నాలుగు నెలలు అయింది... అయినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన ఆర్ఆర్ ట్యాక్స్‌కు సంబంధించిన ఎన్నికల ప్రచార వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

నాలుగు నెలల క్రితం ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని మీరు చెబుతున్నారని, కానీ మీ కేబినెట్ మంత్రులు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదో చెప్పాలన్నారు.
KTR
Narendra Modi
Telangana
Congress
BRS

More Telugu News