వినాయకుడి నిమజ్జనంలో జగన్ పాటలు... వైసీపీ జెండాల ప్రదర్శన
- అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో ఘటన
- డీజేలో ‘కావాలి జగన్.. రావాలి జగన్’ పాటలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- పాటలు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
అప్పటికే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వైసీపీ పాటలు వేయడంతో వాటిని ఆపాలని స్థానికులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డీఎస్పీ, సీఐ అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ పాటలు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.