Selfie With Jagan: జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

Woman Constable Who Take Selfie With Jagan Now On Police Radar
  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెెస్ట్
  • గుంటూరు జైలులో ఆయనను పరామర్శించిన జగన్
  • జైలు బయట జగన్‌తో మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ
  • ఫొటో వైరల్ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ మొన్న పరామర్శించారు. 

అనంతరం బయటకు వచ్చిన జగన్‌తో అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ దిగారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.
Selfie With Jagan
Guntur Jail
Woman Constable
Nandigam Suresh

More Telugu News