Road Accident: అదుపుతప్పిన కారు మెట్లపై నుంచి రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది.. వీడియో ఇదిగో!

Speeding Car Loses Control and Rams Into Haldiram Restaurant in Agra
వేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డుపక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది.. అది కూడా మెట్లపై నుంచి. ఆగ్రాలోని హల్దీరామ్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెట్లపై నుంచి రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లి గేటు వద్ద ఆగిపోయిన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
Road Accident
Agra
Car Accident
Haldiram Restaurant

More Telugu News