YouTuber: నా అంత పెద్ద రౌడీ మరెవరూ ఉండరు జాగ్రత్త!... అంటూ యూట్యూబర్‌ను బెదిరించిన మరో యూట్యూబర్

Bengaluru YouTuber issues open threat declaring himself a  Big Rowdy
  • బెంగళూరులో రౌడీలు వైట్‌ఫీల్డ్‌లోనూ ఉంటారని హెచ్చరిక
  • వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేసిన ఎక్స్ యూజర్లు
  • నిందితుడిని దీపక్ గధిగప్పగా గుర్తింపు
తానో పెద్ద రౌడీనని, తాను రంగంలోకి దిగితే పరిస్థితి వేరేగా ఉంటుందని ఓ యూట్యూబర్‌ను హెచ్చరించిన మరో యూట్యూబర్‌కు బెంగళూరు పోలీసులు సంకెళ్లు వేశారు. నిందితుడిని మోటో వ్లాగ్స్ చేసే దీపక్ గధిగప్పగా గుర్తించారు. సోషల్ మీడియాలో మరో వ్లాగర్‌తో జరిగిన ఆన్‌లైన్ గొడవలో నిందితుడు మాట్లాడుతూ..‘‘బెంగళూరులో రౌడీలు హోస్కోట్‌లో ఉంటారని అనుకుంటున్నావేమో? వారు వైట్‌ఫీల్డ్‌లోనూ ఉంటారు. నగరంలో నాకంటే పెద్ద రౌడీ మరెవరూ ఉండరు. కావాలంటే నీ మనుషుల్ని పంపుకోవచ్చు’’ అని హెచ్చరించాడు. అంతేకాదు, తానో మంత్రి కొడుకునని కూడా చెప్పుకున్నాడు. 

వైరల్ అయిన ఈ వీడియోను ఎక్స్ యూజర్లు షేర్ చేస్తూ బెంగళూరు పోలీసులను ట్యాంగ్ చేశారు. ఈ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో మరో వ్యక్తిని బెదిరిస్తున్నాడని, ఇలాంటివి సమాజంలో భయభ్రాంతులకు గురిచేస్తాయని పేర్కొన్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన కడుగోడి పోలీసులు వ్లాగర్‌ను అరెస్ట్ చేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలాంటి వీడియోలు ఎవరైనా పోస్టు చేస్తే వారికి జైలు కూడు తప్పదని హెచ్చరించారు.
YouTuber
Bengaluru
Vlogger
Karnataka
Crime News

More Telugu News