Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు

Rave Party In Gachibowli Private Gesthouse
  • గెస్ట్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేసిన టెకీ
  • టెకీలతో పాటు సినీ రంగానికి చెందిన వారు హాజరు
  • పోలీసుల అదుపులో 18 మంది యువతీయువకులు
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గెస్ట్ హౌస్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు హాజరయినట్లు సమాచారం. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ పార్టీలో గంజాయి, ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు.. మొత్తం 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆపై వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.
Rave party
Gachibowli
Hyderabad
Software Employee

More Telugu News