apple iphone 16: శాంసంగ్ సెటైర్ ఆపిల్ ను ఉద్దేశించేనా...!

samsung takes jab at apples iphone 16 let us know when it folds
  • నాలుగు నూతన మోడల్స్ ఐ ఫోన్ 16 ఫోన్లను లాంచ్ చేసిన యాపిల్ సంస్థ 
  • యాపిల్ పై శాంసంగ్ విమర్శలు
  • శాంసంగ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ ..ఐ ఫోన్ 16 ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ తో నాలుగు మోడళ్లను యాపిల్ ఆవిష్కరించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను త్వరలో యాపిల్ అందుబాటులోకి తీసుకురానుంది. తాజా ఐఫోన్లపై కూడా శాంసంగ్ తనదైన శైలిలో విమర్శలు చేసింది. 

యాపిల్ ..ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొస్తుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఆ మోడల్ ను తీసుకురాకపోవడంపై శాంసంగ్ పోస్టు పెట్టింది. ‘మడిచేందుకు వీలుగా ఉండే ఫోన్లు వస్తే మాకు తెలియజేయండి’ అంటూ రెండేళ్ల క్రితం చేసిన పోస్టును శాంసంగ్ మళ్లీ పోస్టు చేస్తూ ‘ఇంకా ఎదురుచూస్తున్నాం’ అంటూ సెటైర్ విసిరింది. శాంసంగ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  
 
కాగా, యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి స్వల్ప తేడాతో ఐ ఫోన్ 16ను లాంచ్ చేయడంతో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తున్నారు.
apple iphone 16
Samsung
Social Media
Business News

More Telugu News