జనసేన జెండాపై మూత్రం పోసిన వైసీపీ నేత

YSRCP leader urinated on Janasena flag
  • నూజివీడు నియోజకవర్గంలోని అరిగిపల్లి సెంటర్ లో దారుణం
  • జనసేన జెండాపై మూత్రం పోసిన బెజవాడ హర్ష
  • అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న జనసైనికులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనసేన జెండాపై వైసీపీ యూత్ లీడర్ హర్ష మూత్రం పోసి అవమానించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అరిగిపల్లి సెంటర్ లో అర్ధరాత్రి మద్యం సేవించి తన ఫార్చ్యూనర్ కారులో బెజవాడకు హర్ష వెళ్తున్నాడు. కారులో వెళ్తున్న ఆయన రివర్స్ లో వచ్చి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న జనసేన నేత ముక్కు మహేశ్ (అరిగిపల్లి జనసేన ఉపాధ్యక్షుడు) కారుపై ఉన్న పార్టీ జెండాపై మూత్రం పోశాడు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సాక్ష్యాధారాలతో పోలీసులకు ముక్కు మహేశ్ ఫిర్యాదు చేశారు. మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రవణ్, సీఐ రామకృష్ణ విచారణ చేపట్టారు.
Go Back to Shorts
Janasena Flag
YSRCP
Urination

More Telugu News