Reliance Jio: జియో 8వ వార్షికోత్సవ బొనాంజా... ఆఫర్ కేవలం 5 రోజులే

Reliance Jio has announced special offers on select recharge plans for its mobility users
  • ఎంపిక చేసిన ప్లాన్లపై రూ.700 విలువైన అదనపు బెనిఫిట్స్ ప్రకటించిన టెలికం దిగ్గజం
  • 10 ఓటీటీల సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు మరో రెండు ప్రయోజనాలు
  • సెప్టెంబర్ 5న మొదలై 6 రోజుల్లో ముగియనున్న ప్రత్యేక ఆఫర్
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవ బొనాంజాగా... ఎంపిక చేసిన పలు రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5న మొదలై సెప్టెంబర్ 10న ముగియనున్న ఈ ఆఫర్‌లో రీఛార్జ్ చేసుకునే యూజర్లు రూ.700 విలువైన మూడు ప్రత్యేక బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ మూడు నెలల ప్లాన్స్ అయిన రూ.899, రూ.999 రీఛార్జ్‌లు, వార్షిక ప్లాన్ అయిన రూ.3,599 రీఛార్జులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు పొందనున్న రూ.700 విలువైన ప్రయోజనాలలో 10 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. 28 రోజులపాటు చెల్లుబాటు అయ్యే రూ.175 విలువైన 10 జీబీ డేటా కూడా లభిస్తుంది. 

అదనంగా జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్‌ని కూడా ఆఫర్ చేస్తోంది. ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించకుండానే కస్టమర్లు 3 నెలలపాటు గోల్డ్ మెంబర్‌షిప్‌ బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు రూ.2999 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై రూ.500 విలువైన ఏజియో వోచర్లు కూడా లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఆఫర్లు వర్తింపునకు ఎంపిక చేసిన ప్లాన్స్ ఇవే

రూ.899 రీఛార్జ్ ప్లాన్...
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.899 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ఆఫర్‌లో కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. డేటా విషయానికి వస్తే రోజుకు 2జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు 20జీబీ అదనపు డేటాతో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా పొందవచ్చు.

రూ.999 ప్లాన్ వివరాలు ఇవే...
జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు, రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో యూజర్లు అపరిమిత 5జీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు.

వార్షిక ప్లాన్ రూ.3,599 బెనిఫిట్స్ ఇవే...
జియో అందిస్తున్న రూ.3,599 రీఛార్జ్ ప్లాన్ 356 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తాయి. అపరిమిత 5జీ డేటాను కూడా కస్టమర్లు పొందవచ్చు.
Reliance Jio
Jio
Jio Recharge offers
Jio New Plans

More Telugu News