Manchu Vishnu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంచు విష్ణు విజ్ఞప్తి

MAA is committed to continuous improvement suggestions from industry stakeholders
  • మహిళల భద్రత లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేయాలన్న మంచు విష్ణు
  • సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు మంచు విష్ణు వెల్లడి
  • చిత్ర పరిశ్రమ అభివృద్ధికి 'మా' కట్టుబడి ఉందని స్పష్టీకరణ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత, వారి ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని అభ్యర్థించానని 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

కెమెరా ముందు, వెనుక ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించేందుకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి 'మా' ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళల భద్రతకు, సాధికారతకు ఇండస్ట్రీని ప్రామాణికంగా నిలిపేందుకు తెలుగు పరిశ్రమలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు.
Manchu Vishnu
Tollywood
Telangana

More Telugu News