YS Sharmila: ష‌ర్మిల 'రైనీ సీజ‌న్' వ్యాఖ్య‌లపై మ‌రోసారి ట్రోల్స్

Trolls on YS Sharmila Comments on Rainy Season
'రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్' అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. విజయవాడలో పర్యటించిన షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతే.. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.  

గతంలో కూడా ఆమె 'పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర' అని చెప్పి నవ్వుల పాలైన విష‌యం తెలిసిందే. అలాగే 'ఆడ‌పిల్ల పుట్ట‌గానే ఈడపిల్ల కాదు ఆడ పిల్ల' అంటూ వ్యాఖ్యానించిన వీడియో కూడా గ‌తంలో బాగా ట్రోల్‌కు గుర‌యింది.
YS Sharmila
Andhra Pradesh
Congress

More Telugu News