Vijayawada Floods: వరద బాధితులకు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో

AP NGO announces Rs 120 crore assistance to flood victims
  • ఏపీలో ఇటీవల భారీ వర్షాలు 
  • విజయవాడ ప్రాంతంలో వరద బీభత్సం
  • లక్షలాది మందిపై వరద ఎఫెక్ట్
  • ఒక రోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఏపీ ఉద్యోగులు
ఏపీ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ఇచ్చారు. ఎపీ ఎన్జీవో జేఏసీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో జేఏసీని అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వరకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

Vijayawada Floods
AP NGO
Donation
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News