KCR: 'కనబడుట లేదు' అంటూ కేసీఆర్ బొమ్మతో హైదరాబాద్ లో పోస్టర్లు

KCR missing posters in Hyderabad
  • తెలంగాణలో భారీ వర్షాలు
  • ఇంతవరకు స్పందించని కేసీఆర్
  • విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 'కనబడుట లేదు' లేదు అంటూ పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ లో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. 'కేసీఆర్ మిస్సింగ్' అంటూ పోస్టర్లపై ప్రింట్ చేశారు. "రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్" అంటూ పోస్టర్లలో విమర్శించారు. 

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంత విపత్తు జరిగినా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.  

మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ వరదలతో ప్రజలు అల్లాడుతుంటే... మాజీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని వారు విమర్శిస్తున్నారు.
KCR
Posters
BRS
Congress

More Telugu News