Etela Rajender: ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్

Etela Rajender on Floods
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయన్న ఈటల
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల సాయం చేయాలని డిమాండ్
  • సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు పంపించాలని చెప్పారు.

కోతకు గురైన చెరువులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఈటల సూచించారు. వరదల కారణంగా కొట్టుకుపోయిన పంటలకే కాకుండా, నీటిలో నానిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. 

ఇళ్లను కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టం తీరును అంచనా వేసిన తర్వాత కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని... సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Etela Rajender
BJP
Floods

More Telugu News