P Narayana: జగన్ ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి: మంత్రి నారాయణ

Jagan has to know about flood details says Minister Narayana
  • ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని వ్యాఖ్య
  • బాధితులందరికీ ఆహారం అందాలని సీఎం ఆదేశించారన్న నారాయణ
  • 6 లక్షలకు పైగా ఆహార, నీళ్ల ప్యాకెట్లు అందించామని వెల్లడి
వరదలపై వైసీపీ అధినేత జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ముందు ఆయన తెలుసుకోవాలని మంత్రి నారాయణ హితవు పలికారు. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా? అనేది తెలుసుకోవాలని అన్నారు. భారీ వరదలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని చెప్పారు.

ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఆహారం కచ్చితంగా అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. వరద తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. 

ముఖ్యమంత్రి తాను నిద్రపోవడం లేదని, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని అన్నారు. వరద బాధితులకు 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు అందించామని చెప్పారు. 

బుడమేరు మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


P Narayana
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News