ap floods: వరదల నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వానికి వైజయంతీ మూవీస్ విరాళం

vyjayanthi movies pledging to daonate to ap cm relief fund
  • కృష్ణా వరదలతో భారీగా నష్టం
  • వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్న ప్రముఖులు, సంస్థలు
  • సీఎం సహాయ నిధికి రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించిన వైజయంతి మూవీస్
గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది. దాదాపు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహంతో నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. విజయవాడ నగరంతో పాటు ఆనేక గ్రామాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. ఈ నేపధ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో 'ఆయ్' చిత్ర బృందం వరద బాధితులకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు సోమవారం నుండి వారాంతం వరకూ 'ఆయ్' సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. "ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత" అని పేర్కొంది.
ap floods
krishna river
Vyjayanthi Movies

More Telugu News