paralympics: పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు మెడల్స్

two more medals for india in paralympics
  • పారిస్ లో ఉత్సాహభరితంగా పారాలింపిక్స్ పోటీలు
  • పురుషుల విభాగం సింగిల్స్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నితేశ్ కుమార్ 
  • మహిళల సింగిల్స్ లో తులసిమతి మురుగేశన్‌కు రజిత పతకం
పారిస్ లో పారాలింపిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ పారాలింపిక్స్ బాడ్మింటన్ పోటీలో భారత్‌కు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభతో మరో రెండు పతకాలు తీసుకువచ్చారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ఎల్ 3లో నితేశ్ కుమార్ నిన్న పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్ లో 21-14, 18 -21, 23-21తో డానియేల్ బెతెన్ (బ్రిటన్) ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్ విభాగంలో ఎస్‌యూ 5 ఫైనల్ లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్ లో తులసిమతి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21 -8 తో కేథరీన్ రోసెన్‌గ్రేన్ (డెన్నార్క్) ను చిత్తు చేసింది. దీంతో  సోమవారం భారత్ పతకాల సంఖ్య 11కి చేరింది.
paralympics
Sports News
Thulasimathi Murugesan

More Telugu News