బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
- బీజేపీ ఎన్నికల యంత్రం కాదన్న మోదీ
- ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల కృషికి ఉప ఉత్పత్తి అని వ్యాఖ్య
- ఎంతోమంది కార్యకర్తల జీవితాలు పార్టీకి పెట్టుబడి అంటూ ప్రశంసలు
అనేక మంది కార్యకర్తల జీవితాలు పెట్టుబడి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అనేక తరాల కార్యకర్తలు తమ జీవితాలను ఈ పార్టీకి పెట్టుబడిగా పెట్టారని, నేడు పార్టీ ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాని మోదీ అన్నారు. ''సదస్యత అభియాన్' కార్యక్రమం మరోదఫా ప్రారంభమైంది. దేశంలో ఒక కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి భారతీయ జనసంఘ్ నుంచి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రజలు అధికారం కట్టబెట్టే సంస్థ లేదా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పాటించకుంటే, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే... ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు ఎదుర్కుంటున్న పరిస్థితే మనకూ వస్తుంది’’ అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.