Chandrababu: ఏపీలో వరద పరిస్థితులను అమిత్ షాకు ఫోన్ లో వివరించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu explains flood situations in AP to Amit Shah
  • ఏపీలో కుండపోత వానలు
  • విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
  • నీట మునిగిన విజయవాడ
  • అన్ని రకాల సాయం అందిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చిన అమిత్ షా
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వరద సహాయ చర్యలను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం... ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు. 

ఈ సందర్భంగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సాయం చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
Chandrababu
Amit Shah
Floods
Heavy Rains
Andhra Pradesh

More Telugu News