మీ కుటుంబ సభ్యుడిగా ఇదే నా మనవి.. తెలుగు ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన
- భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎవరూ బయటకు రావొద్దని సూచన
- పలు చోట్ల రోడ్లు మునిగిపోయాయని అప్రమత్తంగా ఉండాలన్న చిరంజీవి
- విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దన్న స్టార్ నటుడు
- విపత్తుల సమయంలో తన అభిమానుల అండ ఉంటుందన్న మెగాస్టార్
అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేసుకుంటున్నానని చిరంజీవి సూచించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు తన అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని, ఇప్పుడు కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నట్టు చిరంజీవి పేర్కొన్నారు.