నేడు ఆరుగురు ఏపీ ఐఏఎస్‌ల పదవీ విరమణ
- సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవకు పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్
- ఆరుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణకు ఉత్తర్వుల జారీ
- పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఇన్‌చార్జి బాధ్యతలు ముఖేశ్ కుమార్ మీనాకు అప్పగింత
అయితే పదవీ విరమణకు ఒక్క రోజు ముందు అంటే శుక్రవారం రజత్ భార్గవను ప్రభుత్వం... సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని జీపీఎం అండ్ ఏఆర్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈరోజు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పోస్టులోనే రజత్ భార్గవ పదవీ విరమణ కానున్నారు. ప్రస్తుతం పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గిరిజా శంకర్ కూడా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఎక్సైజ్, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న ముఖేశ్ కుమార్ మీనాకు పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, అదనపు ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు, బాపట్ల జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావులు కూడా ఈరోజు (శనివారం) పదవీ విరమణ చేస్తున్నారు.