Nandamuri Balakrishna: సెప్టెంబరు 1న బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్... అల్లు అర్జున్ కు ఇన్విటేషన్

tollywood producers invited allu arjun for balakrishna golden jubilee celebration
  • సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో నందమూరి బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ ఫంక్షన్‌కు ఏర్పాట్లు
  • నటీనటులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న టాలీవుడ్ ప్రతినిధులు
  • బుధవారం అల్లు అర్జున్ కు ఇన్విటేషన్ అందజేసిన అసోసియేషన్ పెద్దలు
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు ..నటీనటులకు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. 

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి తదితరులను వేడుకలకు ఆహ్వానించిన సినీ ప్రముఖులు .. ఇటీవలే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ లను కూడా ఆహ్వానించారు.
Nandamuri Balakrishna
Allu Arjun
Tollywood

More Telugu News