ఇది చదివితే తారక్ కు హ్యాట్సాఫ్ చెబుతారు!
- అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన తారక్
- 11 ఏళ్లుగా దివంగత అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటున్న వైనం
- బాద్ షా మూవీ మ్యూజిక్ ఫంక్షన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రాజేంద్ర ప్రసాద్ అనే అభిమాని మృతి
2013లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా బాద్ షా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజు అనే అభిమాని మృతి చెందాడు. ఈ ఘటన జూనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సదరు బాధిత కుటుంబాన్ని కలిసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అభిమాని కుటుంబ బాధ్యతను తాను భుజానవేసుకున్నారు. 11 ఏళ్లుగా ఆ కుటుంబానికి తారక్ ఆర్థికంగా అండగా నిలిచారు.