Srisailam: శ్రీశైలంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి

Hydral electricity production speeds up in Srisailam
  • శ్రీశైలంలో 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • స్పిల్ వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
  • ఎడమ, కుడి గట్టు కేంద్రాల్లో ఊపందుకున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. శ్రీశైలం జలాశయం వద్ద 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

కాగా, శ్రీశైలం డ్యామ్ కు ఎగువ ప్రాంతాల నుంచి 3.11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. డ్యామ్ లో జలకళ ఉట్టిపడుతుండగా... కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఊపందుకుంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 68,807 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కృష్ణా నదిపై దిగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ వద్ద 18 క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,94,758 క్యూసెక్కులుగా ఉంది.
Srisailam
Hydral electricity
Dam
Andhra Pradesh

More Telugu News