Nara Lokesh: అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల‌పై విషం చిమ్ముతున్నారు: మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Fire on YSRCP Tweet about Anna Canteen
  • త‌ణుకు అన్న క్యాంటీన్‌ నిర్వ‌హ‌ణ‌పై వైసీపీ ట్వీట్‌
  • త‌ణుకు క్యాంటీన్‌లో అడుగ‌డుగునా అప‌రిశుభ్ర‌మంటూ వీడియో పోస్ట్ చేసిన‌ వైసీపీ
  • కావాల‌నే అన్న క్యాంటీన్ల‌పై సైకో జ‌గ‌న్‌ విషం చిమ్ముతున్నార‌ని మంత్రి లోకేశ్ ఫైర్‌ 
  • క్యాంటీన్ల‌లో రుచి, శుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని వ్యాఖ్య‌
త‌ణుకు అన్న క్యాంటీన్‌ నిర్వ‌హ‌ణ‌పై వైసీపీ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ కౌంట‌ర్ ఇచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల‌పై సైకో జ‌గ‌న్‌ విషం చిమ్ముతున్నార‌ని మంత్రి నారా లోకేశ్ మండిప‌డ్డారు. క్యాంటీన్ల‌లో రుచి, శుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని తెలిపారు. 

త‌ణుకు క్యాంటీన్‌లో అడుగ‌డుగునా అప‌రిశుభ్ర‌మంటూ వైసీపీ పోస్ట్ చేసిన వీడియో త‌ప్పుదోవ ప‌ట్టిస్తుంద‌ని ట్వీట్ చేశారు. స్ప‌ష్టంగా చేతులు క‌డుగు స్థ‌ల‌ము అని రాసి ఉన్నా బుర‌ద చ‌ల్లేందుకే సింకులో అన్నం తిన్న ప్లేట్ల‌ను వైసీపీ మూక‌లు ప‌డేశాయ‌ని చెప్పుకొచ్చారు. 

"అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. చేతులు కడుగు స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు" అని మంత్రి లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Nara Lokesh
YSRCP
YS Jagan
Anna Canteen
Andhra Pradesh

More Telugu News