ప్రస్తుతం పెళ్లి ప్రణాళికలు లేవు... కానీ: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇటీవల కశ్మీర్ విద్యార్థినులతో మాట్లాడిన రాహుల్ గాంధీ
- పెళ్లి గురించి కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించిన యువతి
- ఇప్పుడు ప్రణాళికలు లేవని... కానీ తోసిపుచ్చలేమని వ్యాఖ్య
- పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ
యువతులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ... పెళ్లి చేసుకోవాలని మీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుందా? అని అడిగారు. ఈ సమయంలో ఓ యువతి మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటారని ఎదురు ప్రశ్నించింది.
దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమిస్తూ వస్తున్నానన్నారు. ఇప్పుడు పెళ్లి ప్రణాళికలు లేనప్పటికీ, కొట్టి పారేయలేమన్నారు.
ఈ సమయంలో విద్యార్థులు జోక్యం చేసుకొని, పెళ్లి చేసుకుంటే తమను పిలవాలని కోరారు. తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.