Chandrababu: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Tollywood bigwigs met AP CM Chandrababu and invites him to Balakrishna Golden Jubilee celebrations
  • సెప్టెంబరు 1న హైదరాబాదులో బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు 
  • నేడు హైదరాబాదులో చంద్రబాబును కలిసిన సినీ పెద్దలు
  • బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం
  • సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. 

ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తదితరులు ఆహ్వానించారు. ఇవాళ హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి వెళ్లిన సినీ పెద్దలు, ఆయనకు శాలువా కప్పి సత్కరించి, మొమెంటో అందజేశారు. 

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావాలన్న ఆహ్వానంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 

కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో నిర్మాత కె.ఎల్. నారాయణ, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, అలంకార్ ప్రసాద్, రాజా యాదవ్  తదితరులు ఉన్నారు.
Chandrababu
Balakrishna
Golden Jubilee Celebrations
Hyderabad
Tollywood

More Telugu News