Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన రష్యా వ్యోమగామి సెర్గీ కొరస్కావ్

Russian astronaut Sergei Koraskov met AP Deputy CM Pawan Kalyan
 
రష్యా వ్యోమగామి సెర్గీ కోరస్కావ్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులోని పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చిన సెర్గీ కొరస్కావ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా వ్యోమగామికి పుష్పగుచ్ఛం అందించిన పవన్ కల్యాణ్, శాలువా కప్పి సత్కరించారు. కాగా, సెర్గీతో పాటు పవన్ ను కలిసిన వారిలో స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డాక్టర్ కేశన్, సీఓఓ యజ్ఞసాయి, సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
Pawan Kalyan
Sergei Koraskov
Hyderabad
Janasena
Andhra Pradesh

More Telugu News