Palla Rajeswar Reddy: గత 9 నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeswar Reddy says that he faced harassment since last nine months
  • అనురాగ్ వర్సిటీ నిర్మాణాలు అక్రమం అంటూ పల్లాపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
  • వ్యక్తిగతంగా తనపై ప్రభుత్వం దాడి చేస్తోందన్న పల్లా
అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాల విషయంలో తనపై కేసు నమోదు కావడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. వ్యక్తిగతంగా తనపై ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. గత 9 నెలల నుంచి తనపై వేధింపులు షురూ అవుతున్నాయని తెలిపారు. 

తాను 25 ఏళ్ల క్రితమే విద్యాసంస్థలు స్థాపించానని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలంటూ మెడికల్ కాలేజీని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నీటిపారుదల శాఖ తమకు ఎన్ఓసీ ఇచ్చిందని పల్లా వెల్లడించారు.

నా భూమిలో మాత్రమే నిర్మాణాలు చేశాం... కబ్జా చేసినట్టు నిరూపిస్తే కూల్చడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తమ మెడికల్ కాలేజీ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేలితే ఆ భూమిని వదులుకునేందుకు తాను సిద్ధమని అన్నారు.
Palla Rajeswar Reddy
Anurag University
HYDRA
BRS
Congress
Telangana

More Telugu News