యూట్యూబ్ చానల్‌తో సాకర్ స్టార్ రొనాల్డో కళ్లు చెదిరే సంపాదన!

Ronald earn huge money from youtube channel
  • యూట్యూబ్ చానల్ ప్రారంభించిన ఫుట్‌బాల్ లెజెండ్ 
  • గంటల వ్యవధిలోనే లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు
  • కోట్లాది వ్యూస్‌తో లక్షల డాలర్ల ఆర్జన
ఫుట్‌బాల్ లెజండ్ క్రిస్టియానో రోనాల్డో అంటే తెలియని వారు ఉండరు. ఇటీవల యూట్యూబ్ చానల్ ప్రారంభించి గంటల వ్యవధిలోనే రికార్డులకెక్కాడు. చానల్ ప్రారంభించిన 90 నిమిషాల వ్యవధిలోనే పది లక్షల మంది సబ్ స్ర్కైబర్లను రోనాల్డో సంపాదించుకున్నాడు. ఆయన వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ఇప్పటి వరకూ రోనాల్డో 12 వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు.
 
ఈ 21న రొనాల్డో తన చానల్ ప్రారంభించాడు. గంట వ్యవధిలోనే పది లక్షల మంది సబ్ స్కైబర్లను సంపాదించుకోవడమే కాకుండా, గోల్డెన్ ప్లే బటన్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు రోనాల్డో యూట్యూబ్ ఆదాయంపై చర్చ జరుగుతోంది. అతని 12 వీడియోలు ఇప్పటికే 5 కోట్ల వ్యూస్ దాటాయి. కేవలం ఒక్క రోజులోనే అతను మూడు లక్షల డాలర్లు ఆర్జించాడని మీడియా కథనాలు వస్తున్నాయి. రోనాల్డో మొత్తం నికర ఆస్తులు 800 మిలియన్ డాలర్ల నుంచి 950 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
Go Back to Shorts
Cristiano Ronaldo
Soccer
Football
YouTube

More Telugu News