MLC Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జుగుప్సాకర వీడియో వెలుగులోకి!

I was Honey Trapped With Morphed Video Says MLC Anantha Babu
  • అనంతబాబు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియో
  • తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన టీడీపీ
  • మార్ఫ్‌డ్ వీడియో అని కొట్టిపడేసిన అనంతబాబు
  • చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యకర వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎవరితోనో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో ఆయన మధ్యమధ్యలో ముద్దులు పెట్టడంతోపాటు అసభ్యకరంగా కనిపించారు. తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. 

అయితే, ఈ వీడియో ఫేక్ అని అనంతబాబు కొట్టిపడేశారు. తాను పిల్లలకు ముద్దులు పెట్టిన వీడియోను కట్ చేసి మార్ఫింగ్ చేశారని, ఇది చూపించి కొన్ని నెలలుగా ఒకరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు, తన వీడియోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు.
MLC Anantha Babu
YSRCP
Viral Video
Andhra Pradesh
YS Jagan

More Telugu News