Gaddar: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా దిల్ రాజు

Narsinga Rao as Gaddar awards committee chairman
  • గురువారం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • విధివిధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో కమిటీ
  • కమిటీ సలహాదారుల్లో రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు
గద్దర్ అవార్డుల కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా కార్యాచరణను ప్రారంభించింది.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం... గద్దర్ అవార్డుల విధివిధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీ చైర్మన్‌గా నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా దిల్ రాజును నియమించిన ప్రభుత్వం... కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్, చంద్రబోస్, తనికెళ్ల భరణి, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, అల్లు అరవింద్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, గుమ్మడి వెన్నెల, బలగం వేణులను నియమించింది. ఎఫ్‌డీసీ ఎండీ ఈ కమిటీకి మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరిస్తారంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎఫ్‌డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశించింది.
Gaddar
Telangana
Dil Raju
Tollywood

More Telugu News