నలభై ఐదేళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ
- చివరిసారిగా 1979 లో ఆ దేశానికి వెళ్లిన మొరార్జీ దేశాయ్
- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత విద్యార్థులకు సాయం చేసిన పోలాండ్
- అక్కడి నుంచి ఈ నెల 23న ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ
ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. కాగా, పోలాండ్ పర్యటన ముగించుకుని ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ తో చర్చలు జరపనున్నారు.