Viral News: నడిరోడ్డుపై రీల్ షూట్ చేసిన మహిళ... వీడియోపై స్పందించిన పోలీసులు

a woman dancing in the middle of a busy road and UP Cops reacted on this
 
రీల్స్ కోసం, వీడియోలను వైరల్‌గా మార్చేందుకు ఇటీవలి కాలంలో అతిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది రిస్క్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇతరుల ప్రాణాలకు కూడా అపాయం కలిగిస్తున్నారు. ఇలాంటి అత్యుత్సాహాన్నే ఓ యువతి ప్రదర్శించింది. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి రీల్ కోసం బిజీగా ఉన్న ఓ రోడ్డుపై డ్యాన్స్ చేసింది. కారు నుంచి కిందికి దిగి నాట్యమాడింది. పక్కనే వాహనాలు వెళుతున్నా ఆమె పట్టించుకోలేదు. రోడ్డుపై క్రాసింగ్ లైన్స్‌ను కూడా దాటి మరీ డ్యాన్స్ చేసింది. ఆమె ఆశించినట్టుగానే వీడియో వైరల్‌గా మారింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. ఇతరుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా స్పందించారు. వెహికల్ నంబర్‌తో పాటు టైమ్, డేట్‌ను కూడా చెప్పాలని కోరారు. సదరు మహిళపై చర్యలు తీసుకునేందుకు ఈ వివరాలు అందించాలని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. 

కాగా, 35 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఎక్స్‌లో 2 లక్షలకుపైనే వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. సులువైన సంపాదన కోసం ఏమైనా చేసేలా ఉన్నారంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓ యూజర్ కోరాడు. కాగా ఇలాంటి వారి కోసం రోడ్డుపై ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించాలంటూ ఓ వ్యక్తి పరిహాసమాడాడు.
Viral News
Viral Videos
Uttar Pradesh
Viral Reels

More Telugu News