ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై సిట్
- ఆసుపత్రి మాజీ చీఫ్ పై అవినీతి ఆరోపణలు
- ప్రత్యేక బృందంతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- వైద్యురాలి హత్యాచారం కేసులో నాలుగు రోజులుగా సీబీఐ విచారణ
ఐజీ ప్రణవ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఆర్జీ కర్ ఆసుపత్రిలో విచారణ జరిపి నెల రోజుల్లోపు నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైన డాక్యుమెంట్లను సిట్ బృందానికి సమర్పించి సిట్ బృందం విచారణకు సహకరించాలంటూ ప్రభుత్వం వివిధ డిపార్ట్ మెంట్లకు నోట్ పంపినట్లు తెలిపాయి. సందీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంటే.. 2021 జనవరి నుంచి ఆయన రాజీనామా చేసిన రోజు వరకు జరిగిన అన్ని ఆర్థిక వ్యవహారాలను సిట్ బృందం పరిశీలించనుంది.