YS Sharmila: దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి: షర్మిల

Sharmila greetings on Raksha Bandhan
  • షర్మిల రాఖీ బంధన్ శుభాకాంక్షలు
  • ప్రతి అన్న, తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
  • అందరినీ దేవుడు చల్లగా చూడాలనేదే తన ప్రార్థన అని ట్వీట్
రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్నాతమ్ముళ్లకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ... రక్త సంబంధం లేకపోయినా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకు రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం అని చెప్పారు. ప్రతి అన్నను, తమ్ముడిని దేవుడు చల్లగా చూడాలనేదే తన ప్రార్థన అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా తోబుట్టువుల్లా నిలబడి... అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ రక్షణగా నిలబడ్డ ప్రతి సోదరుడికి శుభాకాంక్షలు అని తెలిపారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పారు.
YS Sharmila
Congress

More Telugu News