ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే చట్టాన్ని సుప్రీంకోర్టులో సమర్థించిన కేంద్రం

Centre defends law against triple talaq
  • ఈ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మార్చిందన్న కేంద్రం
  • ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేవని వెల్లడి
  • బాధిత మహిళల భర్తలపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్న కేంద్రం
  • ట్రిపుల్ తలాక్ విడాకులను నిరోధించేందుకు కఠిన నిబంధనలు అవసరమన్న కేంద్రం
ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే చట్టాన్ని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ట్రిపుల్ తలాక్‌ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మార్చిందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్‌ ఆచారం... వివాహమనే సామాజిక సంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని పేర్కొంది.

సుప్రీంకోర్టు 2017లో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొందని తన అఫిడవిట్‌లో గుర్తు చేసింది. అయినప్పటికీ కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

ట్రిపుల్ తలాక్ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోవడం... చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో బాధిత మహిళల భర్తలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దీంతో పోలీసులు నిస్సహాయంగా మారిపోయారని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ విడాకులను నిరోధించేందుకు కఠినమైన నిబంధనలు అవసరమని పేర్కొంది.

ట్రిపుల్ తలాక్‌ విధానం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, కాబట్టి ట్రిపుల్‌ తలాక్‌ విడాకులను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Go Back to Shorts
Triple Talaq
Supreme Court
Central Government

More Telugu News