Chandrababu: చూస్తుంటే అందరూ సబ్జెక్ట్ మర్చిపోయినట్టుంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu visits Somasila Project
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ సిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు రక్షణ కట్ట, స్పిల్ వేలను చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి వారికి పలు సూచనలు చేశారు. 

ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా వచ్చినప్పుడు, అధికారులు సబ్జెక్టు బాగా స్టడీ చేసి అన్ని వివరాలతో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.  ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. 

చూస్తుంటే అందరూ సబ్జెక్ట్ మర్చిపోయినట్టుందని, అందుకే పాఠాలు రివైజ్ చేస్తున్నానని చంద్రబాబు చమత్కరించారు. టీఎంసీలు, నీటి కొలతలు గురించి చంద్రబాబు పక్కా నాలెడ్జ్ తో మాట్లాడడంతో, సోమశిల ప్రాజెక్టు ఇంజినీరింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. వారు కూడా సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను చంద్రబాబుకు వివరించారు.
Go Back to Shorts
Chandrababu
Somasila Project
Nellore District
TDP-JanaSena-BJP Alliance

More Telugu News